విద్యుత్ సేవలు మెరుగుపరచాలి
06-10-2026 | 07:26pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్‌ఈ ఉత్తమ్ జాడే(SE Uttam Jade) సూచించారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో సాంకేతిక, ఎంఆర్‌టీ, రెవెన్యూ, కమర్షియల్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో రైతులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించాలని, ఫెయిల్ అయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మార్చాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలపై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు.