బెజ్జూరు నుంచి హైదరాబాద్‌కు బస్సు సర్వీసు ప్రారంభం

19-11-2026 | 10:45pm

సూపర్ లగ్జరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డిపో మేనేజర్ రాజశేఖర్

కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లా బెజ్జూర్(Bejjur) మండల కేంద్రం నుండి హైదరాబాద్ కు బస్సు సౌకర్యం ప్రారంభం కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ డిపో నుండి ఈ సూపర్ లగ్జరీ బస్సు(Super Luxury Bus) సాయంత్రం 4:30  గంటలకు బయలుదేరి కాగజ్ నగర్, సిర్పూర్ టి, కౌటాల, చింతలమానపల్లి మీదుగా బెజ్జూర్ మండల కేంద్రానికి చేరుకుంటుంది. బెజ్జూర్ నుండి 7:30 గంటలకు బయలుదేరి ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

మళ్లీ హైదరాబాదు నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం 6 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రానికి చేరుకుంటుంది. హైదరాబాద్ బస్సు ప్రారంభం కావడంతో ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆధార్ లో తప్పుల సవరణ కోసం, తదితర పనుల కోసం వ్యాపారులు కాగజ్నగర్ వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి తప్పిందని బస్సు హైదరాబాద్ వెళ్లడం శుభపరిణామమని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ సర్వీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: డిపో మేనేజర్ రాజశేఖర్

 బెజ్జూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీస్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్ కోరారు. ప్రయాణికులు హైదరాబాద్ సేవలను సద్వినియోగం చేసుకుంటే ఈ సర్వీస్ సేవలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్ సర్వీస్ సేవర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు