మహిళల పేరుమీదే ఇందిరమ్మ ఇళ్లు: సీతక్క
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత (Women Welfare) ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలకు కల్పిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (Free Electricity) అందిస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, మహిళా సాధికారతే (Women Empowerment) ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లపాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) అందించే చర్యలు చేపట్టిందని వివరించారు.
అదేవిధంగా కొత్తగా 4.75 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. పేదలు, మహిళలు, వృద్ధులు, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు.