అసమ్మతి స్వరాలకు చెక్? మహేశ్ గౌడ్ వార్నింగ్!
రాజగోపాల్, అనిరుధ్ వ్యాఖ్యలపై అధిష్ఠానం నజర్.. మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో(Telangana Congress) ఇటీవల ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ చర్చ మరింత ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Mahesh kumar goud ) స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి నాయకుడైనా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరు ఎమ్మెల్యేల ప్రకటనలను కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తోందని మహేశ్ గౌడ్ తెలిపారు. త్వరలో తెలంగాణకు రానున్న కొత్త పార్టీ ఇన్ఛార్జ్ ఈ పరిణామాలపై పూర్తి స్థాయిలో Review చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అని, ప్రతి అంశానికి ఒక సమయం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో కొండా సురేఖ(Konda Surekha) వ్యవహారంలోనూ చర్యలు తీసుకునే ముందు పలుమార్లు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో పార్టీ నేతలపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించిందని, ప్రస్తుతం డ్యామ్ల వద్ద కేంద్ర బలగాల మోహరింపునకు ఆ నిర్ణయాలే కారణమని వ్యాఖ్యానించారు.
దక్షిణ తెలంగాణకు కీలకమైన SLBC Tunnel పనులు, పాలమూరు-రంగారెడ్డి Lift Irrigation Projectను గత పదేళ్లలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 70 శాతం వాటా కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికి మహేశ్ కుమార్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, పేదల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.