మంత్రి పదవి వస్తే మాటలు మారిపోతాయా?
బలముంటే కొత్త పార్టీ పెట్టుకో.. రాజగోపాల్ రెడ్డికి డీసీసీ చీఫ్ సవాల్!
నల్గొండ : తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Komatireddy vs Revanth) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Munugode MLA Komatireddy Rajagopal Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లిటిగేషన్ నుంచి తొలగించి, ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో రేవంత్ రెడ్డి సోదరులు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీఎం భూ కబ్జాలు, చీకటి వ్యవహారాల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్(Nalgonda District DCC President Punna Kailash) నేత ఘాటుగా స్పందించారు. నిజంగా బలముంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంతంగా కొత్త పార్టీ పెట్టుకోవాలని సవాల్ విసిరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలను గెలిపించుకుని ముఖ్యమంత్రి లేదా మంత్రి కావచ్చని, అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో కొనసాగాలనుకుంటే పార్టీ Rules, క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని హితవు పలికారు.
2029 ఎన్నికల్లో ఏ పార్టీ B-Formతో పోటీ చేస్తారని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించిన కైలాష్ నేత.. డిసెంబర్లో మంత్రి పదవి వస్తే ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలన్నీ మాఫీ అయిపోతాయా అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై AICCకి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.