పేకాట స్థావరంపై పోలీసుల దాడి
19-11-2026 | 10:52pm
చిన్నంబావి: పేకాట స్థావరం(Gambling)పై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామన్ గౌడ్(SI Raman Goud) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం సమీపంలోని కాశి రెడ్డి వాగులో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న వివిధ గ్రామాలకు చెందిన పది మంది వ్యక్తులను అరెస్టుచేసి వారి నుంచి రూ.18,200 నగదు,10 సెల్‌ఫోన్లు, నాలుగు సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.