క్యాంపు ఆఫీసులో గుప్పు మన్న కలహాలు
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial district) బెల్లంపల్లి కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రెండు వర్గాల మధ్య స్వల్ప గొడవ సంచలనం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod), మాజీ మునిపల్ చైర్మెన్ మత్తమారి సూరిబాబు, పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, మరికొందరూ ముఖ్యమైన లీడర్లు భోజనం చేస్తున్నారు. ఇదే క్రమంలో సూరిబాబు, బండి ప్రభాకర్ మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకొని వారించబోయాడు. వారు వినిపించుకోలదు.. కోపోద్రిక్తుడైన సూరిబాబు తన ప్లేట్ ను కిందపడేసి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు సూరిబాబు వర్గానికి ఆహ్వానం లేదని తెలిసింది. ఈ అసంతృప్తి క్యాంపు కార్యాలయంలో గొడవకు కారణమని తెలుస్తోంది. ఇటీవలనే సూరిబాబు వర్గానికి ఎమ్మెల్యే తో సంధి కుదిరింది. ఈ సంఘటనతో మళ్లీ అసమ్మతి రాజ్కుంది. ఐక్యత ముణ్ణాళ్ల ముచ్చటే అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు.