ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi Birthday ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు(MLA KR Nagaraju) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను సంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు , ఏనుమాముల మార్కెట్ చైర్మెన్ ప్రియాంక అనిల్,పింగళి వెంకటరాం నరసింహ రెడ్డి, చిర్ర రాము, అనిల్ రెడ్డి,తిరుపతి రెడ్డి,హసన్పర్తి మండల అధ్యక్షులు అశోక్,మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, స్వాతి, సీనియర్ నాయకులు విసం సురేందర్ రెడ్డి, రామంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.