2 వేల మంది విద్యార్థులకు ఫ్రీ టికెట్లు
- హెచ్‌సీఏ కీలక నిర్ణయం
- భారత్, విండీస్ టీ ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, అక్టోబర్ 9: ఉప్పల్ స్టేడియం వేదికగా వచ్చే బుధవారం జరిగే టీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మ్యాచ్ కోసం 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్‌రెడ్డి ప్రకటించారు. మ్యాచ్ కోసం రెండు కొత్త పిచ్‌లను సిద్ధం చేసినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి వెల్లడించారు. ఫ్లడ్‌లైట్లు, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను సమీక్షించడంతోపాటు ప్రేక్షకులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరు స్తున్నట్లు తెలిపారు.
ప్రేక్షకులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు మ్యా చ్‌ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. మ్యాచ్ కోసం సుమారు 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టికెట్ ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయన్నారు. స్టేడి యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యా వరణహితంగా మ్యాచ్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)తో కలిసి క్లీన్ క్రికెట్ ఇనిషియేటివ్‌లో భాగస్వామిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు కనీసం రెండు గంటల ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ, భ ద్రతా తనిఖీల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.