దొడ్డి దారిన గద్దెనెక్కారు!
- మోదీ గద్దె దిగాలి.. లేదంటే ప్రజలే దింపుతారు
- 13 కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయి?
- ‘ఓటు బచావో.. దేశ్ బచావో’
- ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి గతంలో దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘాన్ని వాడుకుందని, తిరిగి దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేయటం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హెచ్చరించారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం కాపాడలేవని ఆయన స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే పదవి నుంచి తొలగించాలని సీఎం డిమాండ్ చేశారు.
అలా చేయకుంటే మోదీ తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రజలు గద్దె దించుతారని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఓటు బచావో.. దేశ్ బచా వో’ ఉద్యమంలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె, సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండియా కూటమి నేతలు గురువారం ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు మహాప్ర దర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఓటు బచావో... దేశ్ బచావో ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూట మి కోసమో కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమమని రేవంత్ పే ర్కొన్నారు. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరిందనానరు. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దేశ జనాభా 140 కోట్లకు చేరిందని, ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్ల గల్లంతు కావ డం అనుమానాలకు తావిస్తోందన్నారు. అన్ని కోట్ల ఓట్లు ఎలా తగ్గిపోయాయో ప్ర ధాని మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించారు..
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్‌సింగ్ వంటి వారు ప్రాణాలకు తెగించి పోరాటం చేసి స్వాతం త్య్రం తెస్తే, సంపన్నులు, పేదలు అనే తేడా లేకుండా డాక్టర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అనేకసార్లు జరిగిందని, అయినా పేదల ఓట్లకు ముప్పు కలగలే దన్నారు.ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా, రెండు వర్గాలుగా విభజిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరో వైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేష్ కుమార్ పరిస్థితులను మార్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారని, వారి చేతిలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.