రాహుల్‌వి దిగజారుడు రాజకీయాలు

09-10-2026 | 05:00am

ఓటమి భయంతోనే రాజ్యంగ సంస్థలపై విషప్రచారం 

బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు ఆ పార్టీ నాయకులు ఢిల్లీ నడిరోడ్డుపై పడుకుని చేస్తున్న వింత చేష్టలు ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాష్(BJP spokesperson NV Subhash) మండిపడ్డారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల కమిషన్ బీజేపీ లేదా మోదీ అధికారంలోకి వచ్చాక ఏర్పడింది కాదని, దశాబ్దాలుగా నిష్పక్షపాతంగా సేవలందిస్తున్న గొప్ప సంస్థ అని తెలిపారు.

పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చించేందుకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుం డా రాహుల్‌గాంధీ రోడ్లపై పడుకోవడం మీడియా దృ ష్టిని ఆకర్షించేందుకేనని మండిపడ్డారు. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేవ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమికి  పరాజయం తప్పదని తేలిపోవడంతోనే కుట్రపూరిత ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ నిరసనకుల సమాజ్‌వాది పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆఫ్, శరద్‌పవార్ ఎన్సీపీ వంటి మిత్రపక్షాలు మద్దతు ఇవ్వకపోవడంతో వారి ఒంటరితనాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు