ఆ రిలేషన్స్ అన్నీ గుడ్ టైమ్‌లో..
నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘గుడ్ టైమ్(Good Time)’. చాణక్య జిల్లా దర్శకత్వంలో ఈ సినిమాను రమేశ్ జిల్లా నిర్మించారు. ఈ నెల 9న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ గాజుల మాట్లాడుతూ.. “2 గంటల 17 నిమిషాలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాం” అన్నారు. హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ.. “ఫ్రెండ్స్ మధ్య ఉండే రిలేషన్, ప్రేమికుల మధ్య బంధం.. ఇలా అన్ని బాండింగ్స్ మా సినిమాలో ఉంటాయి. యూత్ ఆలోచనలు, వారి ప్రవర్తన, ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా మా సినిమాలో చూపించాం” అని చెప్పింది. ఈ వేడుకలో మిగతా మూవీటీమ్ కూడా మాట్లాడారు.