భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణ మహోత్సవం

24-11-2026 | 10:20am

కల్యాణ వేడుకల్లో పాల్గొన్న చేగుంట మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫీ

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయపల్లి గ్రామ(Ullithimmaipally Village) శివాలయంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని(Shiva Parvathula Kalyana Mahotsavam) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా చేగుంట మైనారిటీ నాయకులు, చేగుంట ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. శివపార్వతుల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు