శివాలయాలలో కార్తీక పౌర్ణమి శోభ
శ్రీశ్రీశ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో దీపాల వెలుగులు.
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండలంలోని శివాలయాలు కార్తీక పౌర్ణమి(Karthika Pournami) శోభను సంతరించుకున్నాయి . కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శివాలయాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం(Sri Balatripura Sundari Sametha Chandramouleeswara Swamy Temple)లో భక్తులు వేకువ జామున నుంచే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు నూరి గోపాలకృష్ణ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పించారు. స్వామి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే అనంత కోటి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నానుడి. భక్తులు శివనామస్మరణతో దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.