అంబేడ్కరిజాన్ని మాటల్లో కాదు

03-11-2026 | 11:46am

చేతల్లో చూపడం అభినందనీయం

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మృతుడు ప్రముఖ అంబేడ్కరిస్ట్ కూసపాటి పద్మారావు(Ambedkarite Kusapati Padmarao) కుటుంబం తమ కుటుంబ సభ్యుని మృతదేహాన్ని వైద్య విద్య, పరిశోధనల కోసం బీబీనగర్ ఎయిమ్స్(AIIMS Bibinagar)కు దానం చేయడం ఎంతో గొప్ప ఆదర్శప్రాయమైన నిర్ణయమని ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ స్టేట్ కోఆర్డినేటర్ మీసాల అరుణ్ కుమార్(Prabuddha Bharat International State Coordinator – Meesala Arun Kumar) కొనియాడారు. మంగళవారం ఆయన ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో మాట్లాడుతూ... ఘట్‌కేసర్ ప్రాంతం నుంచి ఇలాంటి గొప్ప సామాజిక ఆలోచనకు నాంది పలకడం ఎంతో అభినందనీయమన్నారు.

అంబేడ్కరిజం అంటే కేవలం మాట్లాడటం కాదని, బాబాసాహెబ్ ఆశయాలను ఆచరణలో చూపించడం అన్నారు. మరణానంతరం కూడా వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా దేహదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే గొప్ప సందేశాన్ని అందించారని, భవిష్యత్తులో మరెందరో అంబేడ్కరిస్టులు, బాబాసాహెబ్ అభిమానులు ఈ స్ఫూర్తితో ముందుకొచ్చి, దేహదానం వంటి మహోన్నత కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు. బాబాసాహెబ్ ఆశయాలను ఆచరించడమే నిజమైన అంబేడ్కరిజం అని కూసపాటి కుటుంబ సభ్యులను అభినందించారు.

మరిన్ని వార్తలు