అమృతానందమయి దేవి సేవలు ఆదర్శం

11-11-2026 | 05:15am
  1. మానవ సేవే మాధవ సేవ అనే సందేశాన్ని చాటుతున్నారు 
  2. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
  3. అభివృద్ధికి ఆధ్యాత్మికత, సంపదకు సేవాభావం తోడైతేనే సమాజ ఉన్నతి
  4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  5. ఈస్ట్ మారేడుపల్లిలో మాతా అమృతానందమయి మఠం రజతోత్సవం
  6. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు, ఎంపీ ఈటల హాజరు

సికింద్రాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): మానవ సేవే మాధవ సేవ అనే సం దేశాన్ని తన సేవా కార్యక్రమాల(Service activities) ద్వారా మాతా అమృతానందమయి దేవి(Mata Amritanandamayi Devi) (అమ్మ) ప్రపంచానికి చాటి చెపుతున్నారని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. అభివృద్ధికి ఆధ్యాత్మికత, సంపదకు సేవాభావం తో డైతేనే సమాజ ఉన్నతి సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లి (మహేంద్ర హిల్స్)లోని మాతా అమృతానందమయి మఠం రజతోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. ఈ మ హోత్సవానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేం ద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మె ల్సీ మల్క కొమురయ్య హాజరయ్యారు.

వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మ ఆశీస్సు లు పొందారు. ఈ సందరర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. వసుధైవ కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుం బం) అనే భారతీయ సంస్కృతి గొప్ప సందేశాన్ని అమ్మ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారని కొనియాడారు. యువతలో నైతిక విలువలను పెం పొందించేందుకు అమ్మ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. విలువ లతో కూడిన యువతను తీర్చిదిద్దడంలో అమ్మ కృషి ఆచరణాత్మక ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రజలను ఆశీర్వదించడం అదృష్టకరం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మాతా అమృతానందమయి దేవి హైదరాబాద్‌కు విచ్చేసి తెలంగాణ ప్రజలను ఆశీ ర్వదించడం అదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మఠం 25 ఏళ్ల ప్రస్థానం కేవలం ఒక సంస్థ సాధించిన మైలురాయి మాత్రమే కాదని, నిరంతర భక్తి, విద్య, మానవసేవ, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన గొప్ప ఆధ్యాత్మిక సే వా ఉద్యమమని కొనియాడారు.

దేశంలో ప్రకృతి విప త్తులు సంభవించినా, ప్రజలు కష్టాల్లో ఉన్నా అమ్మ ముందుండి సహాయక చర్యలు చేపట్టారని, శారీరక, మా నసిక వేదనలో ఉన్న లక్షలాది మందికి అం డగా నిలిచి వారి జీవితాల్లో ఆశాకిరణాలు నింపారని ప్రశంసించా రు. విద్య, ఉచిత వైద్యం, నిరుపేదలకు గృహ నిర్మాణం, మ హిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వం టి రంగాల్లో మఠం అందిస్తున్న సేవలు ప్ర శంసనీయమన్నారు.

2001 గుజరాత్ భూ కంపం సమయంలో అమ్మ చేపట్టిన సహాయక చర్యలు దేశం పట్ల ఆమెకున్న అంకితభావానికి నిదర్శనమని గుర్తుచేశారు. సేవ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి పౌరు డు తన వంతుగా తోటివారికి సహాయం చేయాలన్నదే అమ్మ సందేశమని స్పష్టం చేశారు. మహేంద్ర హిల్స్‌లోని మఠం విద్యాసంస్థలు విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, సేవాభావాన్ని అంది స్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు.

మార్కులు, సర్టిఫికెట్లతో పాటు మానవీయ విలువలు నేర్పించడం అభినందనీయమన్నారు. ప్రతిభకు సంస్కా రం, సంపదకు సే వాభావం, అభివృద్ధికి ఆధ్యాత్మికత తోడైనప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. యువత పెద్ద కలలు కంటూ నూతన ఆవిష్కరణలతో ప్ర పంచ స్థాయిలో భారతదేశ కీర్తిని చాటాలని పిలుపునిచ్చారు.

25 ఏళ్లుగా ఆధ్యాత్మికతతో పాటు విద్యా, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న మఠం నిర్వాహకులు, ఉపాధ్యాయులు, స్వ చ్ఛంద సేవకులు, భక్తులకు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు