ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా సెల్ఫీ

20-11-2026 | 04:45pm

మహబూబాబాద్: జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో చేపట్టిన నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ నమోదు (Online Registration) ప్రక్రియ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే కేసముద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ బీమా నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే కుటుంబాలకు గుర్తుగా ఉండేలా సెల్ఫీ పాయింట్లు (Selfie Points) ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా బీమా నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు