ఆర్యవైశ్య మహాసభలో మానుకోట నేతలకు కీలక పదవులు
20-11-2026 | 04:42pm
మహబూబాబాద్: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ (Arya Vaishya Mahasabha) కమిటీలో మహబూబాబాద్ జిల్లాకు ప్రాధాన్యత లభించింది. జిల్లాకు చెందిన మాలె నాగేశ్వరరావును వర్తక వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా, తల్లాడ విజయ్ కుమార్ను పొలిటికల్ వైస్ చైర్మన్గా నియమించారు.
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఇరువురు నియామక పత్రాలు (Appointment Letters) అందుకున్నారు. రాష్ట్రస్థాయి కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి కీలక బాధ్యతలు దక్కడం పట్ల స్థానిక ఆర్యవైశ్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.