బోనస్ సీలింగ్ ఎత్తేయాలి

29-09-2026 | 11:23am

రైల్వే కార్మికులకు అందించే బోనస్ పైన సీలింగ్ ఎత్తివేయాలి

మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్

మహబూబాబాద్,(విజయక్రాంతి): రైల్వే కార్మికుల(Railway workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మికులకు చెల్లించే బోనస్‌పై ఉన్న సీలింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్‌లో రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు. మజ్దూర్ యూనియన్(Mazdoor Union) పిలుపు మేరకు జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, SCRMU వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం పి.వే కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ.. రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులపై అదనపు పనిభారం తగ్గించడంతో పాటు సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు.

Track Maintainers గస్తీ పరిధిని 12 కిలోమీటర్లకు పరిమితం చేయాలని, Keymenలకు అప్పగిస్తున్న అదనపు విధులను ఉపసంహరించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు కొత్త Assets‌కు అనుగుణంగా అదనపు పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. OTA, TA బకాయిలను చెల్లించాలని, Leave Encashment, Children Education Allowanceలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

రాత్రి గస్తీ విధులకు ఇద్దరు Petrolmenలను నియమించాలని, అర్హత కలిగిన ఉద్యోగులకు GDCE, LDCE, AVC అవకాశాలు కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పరీక్షలను త్వరగా నిర్వహించడంతో పాటు ఉద్యోగుల పదోన్నతుల కోసం CBT పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు.

రైల్వే ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని, Track Maintainers, Loco Pilotsకు Uniform Kits, Water Bottles అందించాలని డిమాండ్ చేశారు. అలాగే PLBపై ఉన్న ₹7,000 గరిష్ట పరిమితిని తొలగించి, వాస్తవ వేతనాల ఆధారంగా PLB చెల్లించాలని కోరారు.

రైల్వే కార్మికుల న్యాయమైన సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత విస్తృత స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రెటరీ బాబురావు, ఇంజినీరింగ్ కోఆర్డినేటర్ సతీష్, యూత్ లీడర్లు కనకయ్య, గోపీలాల్, జైల్ సింగ్, రాజు, రమేష్, సంతోష్, నరేందర్, రవీ, వరుణ్, లత, లక్ష్మి తదితరులతో పాటు రైల్వే కార్మికులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు