పట్టాలపై గొర్రెల ప్రాణాలు

29-09-2026 | 11:11am

రైలు ఢీకొని పలు గొర్రెలు మృతి

కన్నీరుమున్నీరైన గొర్రె కాపరులు

ఘట్ కేసర్,సెప్టెంబర్ 29(విజయక్రాంతి): రైలు ఢీకొని పదుల సంఖ్యలో గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అవుషాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లాకు పొందిన గొర్రెలకాపరులు తమ  గొర్రెల మందను మేత కోసం ట్రాక్ సమీప గుండా తీసుకువెళ్తూ అవుషాపూర్ సమీపంలో సేద తీర్చుకోవడానికి అక్కడ ఆగినట్లు తెలుస్తుంది. అదే సమయంలో గొర్రెలు రైలు పట్టాల పైకి వెళ్లడంతో వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది. ​రైలు వేగానికి గొర్రెలు ట్రాక్‌(Track)పై చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

​ఉన్నట్టుండి రైలు(Train) రావడంతో గొర్రెలను కాపాడుకునేందుకు సమయం లేకుండా పోయిందని కాపరి కన్నీరుమున్నీరయ్యాడు. తన జీవనాధారమైన గొర్రెలు చనిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు