కర్కాటక రాశి వారికి కలిసొచ్చే సమయం
29-09-2026 | 10:59am
కర్కాటకం: శ్రమకు తగ్గ ఫలితం.. ఉద్యోగంలో సానుకూల మార్పులు!
కర్కాటక రాశి(Cancer (Zodiac sign))వారికి వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు అందే అవకాశం ఉంది. అయితే మిత్రుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది.