కేసముద్రం పట్టణ రజక సంఘం కమిటీ ఎన్నిక

29-11-2026 | 02:24pm

కేసముద్రం: కేసముద్రం పట్టణ(Kesamudram town) రజకుల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం పట్టణ రజక సంఘం నిర్ణయించింది. ఆదివారం రజక సంఘ పెద్దలు కేసముద్రం గ్రేన్ మార్కెట్ యార్డులో సమావేశమై రజక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. కేసముద్రం పట్టణ రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

అధ్యక్షునిగా కొలిపాక బాబు, ఉపాధ్యక్షులుగా ఎర్రబోతుల యాకయ్య, పొడుపుగంటి రామ్మూర్తి,ప్రధాన కార్యదర్శిగా టేకుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా కాంపాటి మహేందర్, పరకాల కుమార్, కోశాధికారిగా సట్ల వెంకన్న,గౌరవ అధ్యక్షులుగా బండి వెంకన్న, ముఖ్య సలహాదారులుగా పరకాల బిక్షం, చాగంటి కిషన్, ముప్ప ఏకాంతం, కొలిపాక వెంకన్న, కార్యవర్గ సభ్యులుగాకాంపాటి వీరయ్య, ఓరుగంటి యాకయ్య ,బండి లక్ష్మణ్, కొల్లిపాక శ్రీను ఎన్నికైనట్టు నూతన అధ్యక్షుడు బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు