ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
13-11-2026 | 02:19pm
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
జడ్చర్ల,(విజయక్రాంతి): మండలం పరిధిలోని నస్రుల్లాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Nasrullabad Zilla Parishad High School)ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు.
దీంతో వారందరికీ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, సమయపాలనలో నిర్లక్ష్యం వహించరాదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.