వీవో భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ సత్తన్న
లక్షేట్టిపేట, నవంబర్ 13( విజయక్రాంతి) మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ(Kommugudem Gram Panchayat) పరిధిలోని వీవో భవనానికి సర్పంచ్ దుమ్మని సత్తన్న శుక్రవారం టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సంఘం సభ్యులు గుర్తించాలన్నారు. సమాజంలోని పేదరికాన్ని రూపుమాపే క్రమంలో పొదుపు సంఘాల సేవలు ఎంతో ముఖ్యమన్నారు.
మహిళల సంఘాలు బలోపేతం అవుతే మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని వివరించండి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చొప్పదండి రవి, వార్డ్ సభ్యులు బేక్కం సృజన్, రేగుంట హరీష్, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్, సీసీ జనార్దన్, వీవో సభ్యులు సూరం శిరీష, బిరుదుల రాజ్యలక్ష్మి, లావణ్య, యూత్ అధ్యక్షులు శ్రీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.