కేజీబీవీ బాలికలకు వాక్సిన్ కార్యక్రమం

13-11-2026 | 04:02pm

కన్నాయిగూడెం, నవంబర్ 13(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర(Primary Health Centre) పరిధిలోని ముప్పనపల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం రోజున హ్యూమన్ పాపిలోమా వైరస్(Human Papillomavirus) నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం డాక్టర్ క్రాంతి కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాలు నిండిన అర్హులైన బాలికలకు 20 మందికి హెచ్ పి వి వ్యాక్సిన్ అందించడం జరిగింది. 

హెచ్ పి వి వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రాముఖ్యత క్యాన్సర్ నివారణకు మరియు మహిళా ఆరోగ్య పర్యవేక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని మరియు పాఠశాల సిబ్బంది,వైద్య సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్ సుజాత,హెల్త్ సూపర్వైజర్ రమణకుమారి,హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్,కవిత,పుణ్యవతి,సమ్మక్క,సబిత,లక్ష్మి మరియు గ్రామంలోని ఆశాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు