చిన్నారులతో గీతం ఎంబీఏ విద్యార్థుల ఆనందోత్సవం!
‘జాయ్ ఆఫ్ గివింగ్’తో దాతృత్వ స్ఫూర్తి చాటిన విద్యార్థులు
పటాన్ చెరు, నవంబర్ 13: బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎంబీఏ విద్యార్థులు(MBA students of GITAM School of Business) వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మియాపూర్లోని వివేకానంద సేవా సంఘానికి చెందిన 41 మంది చిన్నారులను గీతం ప్రాంగణానికి ఆహ్వానించి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు. చిన్నారులకు స్వెట్టర్లు, టీ-షర్టులు, స్టేషనరీతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతం బీ-స్కూల్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొని విద్యార్థుల సేవా స్ఫూర్తిని అభినందించారు.