ఎన్ని విచారణలు వేసినా.. నన్నేమి చెయ్యలేరు!
- ఎందుకంటే నా కోటరీ నాకుంది
- ఇప్పటికే అందర్ని మేనేజ్ చేసుకొన్నా
- ఇది నేను ఏర్పాటుచేసుకొన్న సామ్రాజ్యం
- ఇక్కడ్నుంచి నన్నెవ్వరు కదిలించలేరు
- ప్రభుత్వాలు మారినా నాదే పై చెయ్యి
- మహిళలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న బాస్
- కఠిన చర్యలు ప్రారంభించాం..
- రెండు రోజుల్లో ఉత్తర్వులుః మెప్మా పీడి
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): పాలమూర్ మెప్మా(Palamuru MEPMA)లో మహిళలకు ఏ మాత్రం స్వేచ్చ లేకుండా అంతా తన క బంధ హస్తాల్లోకి తీసుకొని పెత్తానం చెలాయిస్తోన్నా పురుష ఉద్యోగి ’బాస్’ వ్యవ హారాన్ని అతగాడి బాదితులు విజయక్రాంతి దృష్టికి తీసుకరావడంతో కథనాల రూప ంలో విజయక్రాంతి వెలుగుల్లోకి తీసుకొచ్చి ంది... వెంటనే అధికారులు స్పందించి కఠిన చర్యలకై విచారణ చేపట్టారు.
అయితే ఆ బాస్ ముందుగా కొంత మెత్తబడిన ఆ తరువాత అతను ముందస్తుగానే ఇలాంటి ప రిస్థితులు వస్తే ఏం చెయ్యాలని ముందస్తుగానే ఓ కోటరీని ఏర్పాటు చేసుకొన్నారు. ఆ కోటరీయే నన్ను కాపాడుతోందనే ధీమాలో కనిపిస్తున్నాడట. గతంలో ఒకటి రెండుసార్లు ఇలాంటి పరిస్థిలు వచ్చినప్పుడు ఆ కోటరీ కాపాడిందని, ఇప్పుడు కూడా ఆ కోటరీయే నన్ను కాపాడుతోందని చెబుతున్నాడట.
ఎ ందుకంటే ఆ కోటరీ వెనుకున్నది నేనే కాబట్టి నేనే లేకపోతే ఆ కోటరీ ముందుకు నడువలేదని చెబుతున్నాడంటే ఎంతకు దిగజారాడో తెలుస్తోంది. ఇక అతను ఏర్పాటు చేసుకొన్న కోటరీని తన వెంట తీసుకొని తనదైన శై లిలో నేతల దగ్గరికి వెళ్లి చక్రం తిప్పే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు. నేతలకు ఆ బాస్ నానా రకాల కథలు చెప్పి తనకు అనుకూల ంగా మార్చుకొని అందర్ని మేనేజ్ చేసుకొన్నానని ఇక నాలాంటి భయం లేదని చె బుతున్నాడట.
ఇప్పుడు ఇక నా పై ఎన్ని విచారణలు వేసిన నన్నెవ్వరు ఏమీ చెయ్యలేరని మెప్మా కార్యాలయంలో తోటి మహిళా ఉద్యోగులపై విరుచుకుపడుతున్నాడట. అక్కడితో ఆగకుండా నాపై జరుగుతోన్నా విచా రణకు ఎలా అడ్డుకట్ట వెయ్యాలో నాకు బా గా తెలుసని, ఇప్పుడు ఆ విచారణను ఆగిపోయ్యేలా చేశానని చెబుతున్నట్లు బాదితులు చెబుతున్నారు. అతని మాటలు నమ్మి వదిలేసేందుకు నేతలకు మా బాధలు పట్టవా అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది నేను ఏర్పాటు చేసుకొన్న సామ్రాజ్యం...
మహిళా సంఘాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం మెప్మా ద్వారా అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంల్లోకి రాగానే ప్రతి మ హిళను కోటీశ్వరులుగా చెయ్యడమే ప్రధాన ఉద్దేశ్యంగా కృషిచేస్తుంటే..పాలమూర్ మె ప్మా మాత్రం నేను ఏర్పాటు చేసుకొన్నా సా మ్రాజ్యమని ఆ పురుష ఉద్యోగి అయిన బా స్ చెప్పడం అశ్చర్యాన్నికి గురిచేస్తోంది. ఎం దుకంటే 15 ఏళ్లుగా నేనే ఇక్కడ పనిచేస్తున్నా, ఇక్కడ్నుంచి నన్నెవ్వరు కదిలించల్లేరని అత ను గొప్పగా కాలరేసుకొని కార్యాలయంలో చెబుతున్నాడట.
ప్రభుత్వాలు మారిన నాదే పై చెయ్యి..
ఏ ప్రభుత్వం వచ్చినా, పాలమూర్లో ఎవ్వ రు ఎమ్మెల్యేగా గెలిచినా మెప్మాలో మాత్రం నాదే పై చెయ్యి అని చెబుతూ తోటి మహిళా ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడట. ఎందుకంటే అతను అలాగ వ్యవ హరిస్తాడట. మహిళలను మాట్లాడనివ్వకుం డా, వారిపై అతను నోరు పెద్దగా చేసి వారిని భయబ్రాంతులకు గురిచేసి నేతల మెప్పు పొందుకొంటాడని మహిళలు చెబుతోన్నా మాట ఇది. ఇక ఈయన వ్యవహారం ఇ ప్పుడు బయటికి రావడంతో నాపై ఎవ్వరు పిర్యాదు చేసినా ఎవ్వరు నన్నేమి చెయ్యలేరని తెలుసుకోవాలని మహిళలపై విరుచు కుపడుతున్నాడట.
ఇక పిర్యాదు చేసిన వా రిని నేను అంత తేలికగా వదిలి పెట్టనని, ము ందే చెప్పాను కదా నాకు పెద్ద పెద్ద హాకర్స్ తెలుసు వారిచే మీ ఫోన్ కాల్ డేటా తీయించి మీ అంతు చూస్తానని వారిని భ యబ్రాంతులకు గురిచేస్తునా ్నడని బాధిత మహిళలు భయాందోళనకు గురవుతున్నా రు. ఇతనిపై అధికారులు, నేత లు వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఇక్కడి నుండి తొలగించినట్లు అయితే అతని బా ధిత మహిళ లమంతా ధైర్యంగా ముందుకు వచ్చి అతడు చేసిన వ్యవహారాలన్నింటిని ఆధారాలతో అందజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు.
కఠిన చర్యలకు రంగం సిద్ధం:
మెప్మాలో పెత్తానం చెలాయిస్తోన్నా ఆ పురుష ఉద్యోగిపై వెలుగుల్లోకి వచ్చిన కథనాలతోపాటు, అతనిపై ప్రతి రోజు వస్తోన్నా పిర్యాదులను పరిగణల్లోకి తీసుకొన్నాం. వెంటనే కఠిన చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేశాం. సెలవు రోజులు కావడంతో ఉత్తర్వుల జారీ అలస్యమైంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్వర్వులు జారీ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకొని మహిళలకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తామని పీడి విజయక్రాంతికి తెలిపారు.
ఎండీ యూసుఫ్, మెప్మా పీడీ