67,300 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

27-11-2026 | 03:03pm
  1. ప్రజల మధ్యే సీఎం రేవంత్‌రెడ్డి
  2. ఫామ్‌హౌస్‌కే కేసీఆర్‌ పరిమితం 
  3. ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్‌కే(Pragati Bhavan), ప్రతిపక్షంలోకి వచ్చాక ఫామ్‌హౌస్‌కే (Farmhouse) పరిమితమైన కేసీఆర్‌కు భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

నగరంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 67,300 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 11 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, పాత కార్డుల్లో 35 వేల మంది పేర్లు చేర్చిందన్నారు. నియోజకవర్గంలో 8 వేల ఇందిరమ్మ ఇళ్లు, పట్టణంలో 5 వేల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, 2,600 పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. పేదల సంక్షేమం, నగర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ దశలవారీగా సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, సీజే బెనహర్, మైత్రి యాదయ్య, పట్టణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజ్మత్ అలీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్, కార్పొరేటర్లు తాహేర్, ఫకృ, నాయకులు రామకృష్ణ, చిన్నరాజు, ఖాజాపాషా, తిరుశతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు