ఘనంగా తిరుమలనాథ స్వామి ఆలయ పున ప్రతిష్ట ఉత్సవాలు
14-10-2026 | 03:30pm
రాజాపూర్ అక్టోబర్ 14: మండలంలోని చొక్కామ్ పేట్ గ్రామంలో(Chokkam Pet village) శ్రీ తిరుమలనాథ స్వామి(Sri Tirumalanatha Swamy) (గుండు తిరుమలయ్య ) ఆలయ పున ప్రతిష్ట మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యా వచనం,పంచగవ్యం, మాతృక పూజ యాగశాల ప్రవేశం,కలశ స్థాపన, దేవత ఆహ్వాన పూజలు అత్యంత భక్తుశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అలివేలు వెంకటేష్, చించోడు అభిమన్యు రెడ్డి, మల్లేష్ లక్ష్మణ్, శాంతయ్య, కృష్ణయ్య, సేవ్యనాయక్, మల్లేష్,నరసింహులు వివిధ గ్రామాల సర్పంచులు భక్తులు పాల్గొన్నారు.