అక్రమ నిర్మాణాలను అరికట్టాలి
కొమరవెల్లి, ( విజయ క్రాంతి ): కొమురవెల్లి మల్లన్న దేవస్థానం(Komuravelli Mallanna Temple) పరసరా ప్రాంతమైన ఎల్లమ్మ గుడికి వెళ్లే దారిలో నిర్మిస్తున్న బిల్డింగ్ పర్మిషన్ రద్దుచేసి, నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు రోడ్డుపై అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డుపై నిర్మిస్తున్న బిల్డింగుకు గ్రామపంచాయతీ వారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని వారు ప్రశ్నించారు. సెట్ బ్యాక్ లేకుండానే భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు. వెంటనే నిర్మాణంలో ఉన్న పనులను సంబంధిత పంచాయతీ కార్యదర్శి పరిశీలించాలని సూచించారు. రోడ్డుపై నిర్మిస్తున్న భాగాన్ని మొత్తం కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు.
దేవస్థానం అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బద్దిపడిగా కృష్ణారెడ్డి, తేలు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.