సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ సంతవద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పంచాయతీ కార్యదర్శి ఉమ్మల్ల విజేందర్, వార్డు సభ్యులు గంధం ఓదాకర్, కొడపాక అనిల్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.