గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నా

14-10-2026 | 05:19pm

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం

హనుమకొండ, అక్టోబర్ 14(విజయ క్రాంతి): ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని,ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు క్యాంపు కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 31వ ,50 వ డివిజన్ పరిధిలోని దీన్‌దయాళ్ నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శాయంపేట డివిజన్‌లో గత మూడేళ్లుగా అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని, పూర్తిస్థాయి గ్రామీణ వాతావరణం కలిగిన శాయంపేట డివిజన్‌ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో శాయంపేట పరిధిలోని కొన్ని కాలనీలకు ఎమ్మెల్యేలు సైతం పర్యటించని పరిస్థితి ఉండేదని, తాను గెలిచిన నాటి నుంచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు.

ఇప్పటికే పలు కాలనీల్లో అంతర్గత రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని,అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా కృషి చేశామని తెలిపారు. ఇంకా ఇళ్లు మంజూరు కావాల్సిన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రానున్న రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి పలు స్థానిక సమస్యలను తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ మార్క విజయ్,మాజీ కార్పొరేటర్లు మామిండ్ల రాజు యాదవ్ ,నెక్కొండ కవిత కిషన్,డివిజన్ అధ్యక్షులు సత్తు రమేష్,మాజీ అధ్యక్షులు సురేందర్ ,స్థానిక కాలనీ నాయకులు మామిండ్ల సురేష్ యాదవ్, అశోక్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు