రేపు నాగల్గిద్ద మండల సర్వసభ్య సమావేశం
నాగల్గిద్ద, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం(Zilla Parishad General Body Meeting) అక్టోబర్ 15న గురువారం ఉదయం 11 గంటలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheswara Rao) తెలిపారు. సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ శెట్కార్, మండల ప్రత్యేక అధికారి, సబ్కలెక్టర్ ఉమాహారతి హాజరుకానున్నట్లు వెల్లడించారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, పెండింగ్ పనులతో పాటు జలసిరి, వీబీ–జీ రామ్జీ, పారిశుద్ధ్యం, ఇంకుడు గుంతలు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, రహదారుల సమస్యలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.