అయ్యవారిపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

14-10-2026 | 05:25pm

భిక్కనూర్, అక్టోబర్‌ 14 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగనగర్‌ నరేందర్‌రెడ్డి(Naganagar Narender Reddy) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ జాల సత్యం, గ్రామ పార్టీ అధ్యక్షుడు బల్రాజు, ఉపాధ్యక్షుడు బల్ల నర్సింహులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు