శిథిలాల నుంచి.. శిఖరాల వైపు
- భయంతో బతుకుతున్న కుటుంబాలకు భరోసా టవర్లు
- నిన్నటి భయాలకు భరోసా రేపటి తరాలకు భద్రమైన గూడు
- రూపు రేఖలు మారనున్న రాజీవ్ గృహకల్ప ఇండ్లు
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కృషి చిరస్మరణీయం
- ప్రచారం కాదు పనులు చేస్తున్నాం : మారేపల్లి సురేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, మహబూబ్ నగర్
మహబూబ్‌నగర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : కూలే గోడలకు కాలం చెల్లింది.. కొత్త గూళ్లకు బాటలు పడుతున్నాయి... నగరంలోని బండమీదిపల్లి ప్రాంతంలో(Bandameedipalli area) రాజీవ్ గృహకల్ప శిథిలావస్థకు(Dilapidated state of Rajiv Gruhakalpa) చేరుకోవడంతో ఇటీవల పలుచోట్ల గోడలు కూలి పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) తో పాటు డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నా వారికి నూతన టవర్స్ నిర్మించి ఇస్తామని భరోసానిచ్చారు.
ఈ మాట విన్న ప్రతి ఒక్కరు ఆర్థిక మద్యంలో కొట్టుమిట్టాలాడుతూ ఉన్న ప్రభుత్వంలో నూతన టవర్స్ నిర్మించేందుకు నిధులు మంజూరు అవుతాయా? సందేహంమే వారిని వెంటాడినట్లు తెలుస్తుంది. కాగా చెప్పిన మాటకు నిలువెత్తు నిదర్శనంలా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ప్రజలకు మంచి చేయాలని సంకల్పమే తమ ముందున్న ప్రధానుల లక్ష్యం అంటూ నూతన గా విశాలమైన ప్రాంతంలో నూతన టవర్స్ ను నిర్మించి ఇచ్చేందుకు అనుమతులు తీసుకువచ్చిన్రు. అనుమతులు అందడంతో రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్న ప్రజలు ఆశలకు మరింత భరోసా కలిగింది. చెప్పడం కాదు చేసి చూపిస్తున్నామంటూ మరో మారు నిరూపితం కావడంతో నగరవాసుల్లో నూతన ఉత్సాహం నింపుకుంటుంది.
480 కుటుంబాలకు కొత్త ఆశలు
పాత ఇళ్లకు వీడ్కోలు పలుకుతూ ఇందిరమ్మ టవర్లతో కొత్త వెలుగులు నింపనున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయానికి తెర.. సురక్షిత నివాసాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కన్నీటి గూళ్లకు కంచుకోటలు.. పేదల కోసం ప్రత్యేక టవర్లు నిర్మించేందుకు అడుగులు పడడంతో గోడలు కూలుతున్న చోట.. ఆశల సౌధాలు మొలుస్తున్నాయి. 480 కుటుంబాలకు నీడనిచ్చేలా నిర్మిత కేంద్రం అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో జీ+5 విధానంలో 12 టవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో టవర్ లో 40 ఫ్లాట్లు చొప్పున మొత్తం 480 ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
శిథిలాల నీడ చెదిరి.. సొంతింటి కల విరిసే వేళ
రాజీవ్ గృహకల్ప లో ప్రస్తుతం ఉన్న 380 కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మిగిలిన ఫ్లాట్లను ఇతర అర్హులకు కేటాయించనున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.8.50 లక్షలు ఖర్చు చేయనుండగా, ప్రభుత్వం రూ.5 లక్షలు, లబ్ధిదారుడు రూ.3.50 లక్షలు భరించాల్సి ఉండగా అవసరమైన వారికి బ్యాంకు ద్వారా రుణాలు కూడా ఇప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నట్లు సమాచారం. ఈ టవర్ల నిర్మాణం వచ్చే నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊహించలేని బహుమతి ఇచ్చిండ్రు
కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తారని అస్సలు ఊహించలేదు. ఎందుకు కృషి చేసిన ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు రుణపడి ఉంటాం. మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకు తెలియని పరిస్థితి ఉండే. ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాం.
పుష్పలత, రాజీవ్ గృహకల్ప నివాసి, మహబూబ్ నగర్
చెప్పలేనంత సంతోషంగా ఉంది..
నూతనంగా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఆ సంతోషం మాటల్లో చెప్పలే నంతగా ఉంది. వర్షాలు కురిస్తే బిక్కుబిక్కుమంటూ ఈ శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ఆవేదనను గుర్తించి కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తా మని చెప్పడం వారికి రుణపడి ఉంటాం.
- - లావణ్య, రాజీవ్ గృహకల్ప నివాసి, మహబూబ్ నగర్
పేదల సంక్షేమం కోసం కంకణ బద్ధులమై పనిచేస్తున్నాం..
రాజీవ్ గృహకల్ప లో కొంత కూలిపోయిన సమయంలో పూర్తిస్థాయిలో పరిశీలించి వారికి కొత్తగా నిర్మించి ఇస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇండ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. నూతన టవర్స్ ను నిర్మించి పార్కుతో పాటు విశాలమైన ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసి వారికి అందిస్తాం. సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.
- మారేపల్లి సురేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, మహబూబ్ నగర్