విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తాం
06-10-2026 | 07:46pm
రాజాపూర్ అక్టోబర్ 6: రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని ఏఈ వెంకటేష్(AE Venkatesh) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో ప్రజాపాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సబ్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్ స్తంభాలకు స్ట్రక్చర్ పెయింటింగ్ వేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు సోమేశ్ శ్రీనివాస్, మైనోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.