మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ

28-10-2026 | 09:09pm

బెల్లంపల్లి: మత్తు పదార్థాల నిర్మూలన పై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. మత్తు పదార్థాల వాడకం నిర్మూలన, అవగాహన కోసం  కేంద్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నుండి యువతను కాపాడడం కొరకు నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.

మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు  మత్తు పదార్థాల నిర్మూలన పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య, బెల్లంపల్లి సబ్ డివిజన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు  గజెల్లి మోహన్, శూరం లక్ష్మీనారాయణ, వేల్పుల రాజేందర్, అధ్యాపకులు పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు