రాష్ట్ర పక్షి పాలపిట్టను రక్షిద్దాం..
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ తెలంగాణ రాష్ట్ర గౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాష్ట్ర పక్షి పాలపిట్టను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెన్నూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) A. రామమూర్తి(Ramamurthy) అన్నారు.
ఆదివారం చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఆయన డివిజన్ ఉద్యోగులతో కలిసి “రాష్ట్ర పక్షి పాలపిట్టను రక్షిద్దాం – తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం” అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలపిట్ట ప్రాముఖ్యత, పక్షుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి. చెంద్రమౌళి, నీల్వాయి రేంజ్ ఆఫీసర్ హాఫీజోద్దీన్, చెన్నూర్ డిప్యూటీ రేంజ్ అధికారి పి. ప్రభాకర్, ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రేమలత పాల్గొన్నారు.