ఎంప్లాయిస్ హెల్త్ స్కీం వైద్య సేవలపై ఆరాతీత...
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)(District Medical and Health Officer) డాక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు బుధ వారం జిల్లా ఎంప్లాయిస్ జాక్ అధ్యక్షుడు గడియారం శ్రీహరి, పున్నం మల్లయ్య, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు సత్యనారాయణ, రాకేష్ తో కలిసి ఆరాతీశారు.
పట్టణంలోని వసుధ, వైష్ణవి డెంటల్ తదితర ఆసుపత్రులని సందర్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 16 ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలలో భాగంగా పని చేస్తున్నాయని, వీటిలో ఎంప్లాయిస్ హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తుందని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.