మంచిర్యాలలో ఘనంగా దసరా వేడుకలు
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంగళ వారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కొక్కిరాల చరణ్ రావులతో కలిసి అమ్మవారి పూజ చేసి రథాన్ని ప్రారంభించారు. ఊరేగింపుగా మంచిర్యాల గోదావరి తీరాన గల గౌతమేశ్వర ఆలయం ప్రాంగణంలో జమ్మి చెట్టు వద్ద శమీ పూజా చేసిన
అనంతరం గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలందరు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు జమ్మి పెట్టి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.