జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్

21-10-2026 | 01:05pm

భూపాలపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బుర్ర వినోద్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో నూతన జిల్లా కమిటీ వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లా యూత్ అధ్యక్షుడిగా వినోద్ గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు.

తనపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు వినోద్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు