నీలం మధుకు దసరా శుభాకాంక్షలు!

21-10-2026 | 01:47pm

పటాన్‌చెరు / జిన్నారం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాదారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్–సుధారాణి దంపతులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజలందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కుమ్మరి కుమార్, బజరంగ్ సింగ్, రామకృష్ణ, నరసింహ ముదిరాజ్, లింగం, వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు