డ్రైవర్లకు దసరా కానుకగా యూనిఫామ్‌లు పంపిణీ!
టేకులపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ టిప్పర్ ఓనర్స్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు దసరా కానుకగా యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. బుధవారం టేకులపల్లి లారీ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు యూనిఫామ్‌లను అందజేశారు. దసరా పండుగ సందర్భంగా డ్రైవర్లను ప్రోత్సహించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లారీ రవాణా రంగంలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వారి సేవలను గుర్తించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు కోరం సురేందర్, కోల్ కాంట్రాక్టర్ చిట్టీ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు నెలవెల్లి నరసింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, టేకులపల్లి ఎస్ఐ కె. తిరుపతి, అసోసియేషన్ కార్యదర్శి అరవ వెంకటేష్, భూక్య సర్దార్, నీరుడు సురేష్, డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు గుండాల వెంకన్న, యాకుబ్ శావలి, మదార్ తదితరులు పాల్గొన్నారు.