ఉమ్మడి జిల్లా స్థాయి బాడ్మింటన్ ఎంపిక పోటీలు
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్ లో బుధ వారం SGF (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ )(School Games Federation) ఆధ్వర్యంలో అండర్ -17, అండర్ -14, అండర్ 19 బాలబాలికల బ్యాడ్మింటన్ (BADMINTION) జోనల్ స్థాయి ఎంపిక పోటీలను కార్పొరేటర్ స్రవంతి కిషోర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 150 మంది క్రీడా కారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధనోపాధ్యాయులు బండి రమేష్, DTO శివ శంకర్ వర ప్రసాద్, TGNPDCL DE రాజేశం, MVI రవీందర్, SGF సెక్రటరీ యాకుబ్, రిటైర్డ్ ITI ప్రిన్సిపాల్ రమేష్, బాడ్మింటన్ సెక్రటరీ సుధాకర్, క్లబ్ treasurer సత్యపాల్ రెడ్డి, పీడీలు విజయ్, నందం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, గాజుల శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, జంపాల రమేష్, భూమన్న, జిల్లా నలుమూలల నుంచి PETలు, PDలు, క్రీడాకారులు పాల్గొన్నారు.