ఆరోగ్యకరమైన జీవితానికి కొత్త పరిశోధనా బాట

04-11-2026 | 08:49pm

బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం & ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా(Herbalife India), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) చేతులు కలిపాయి.  ఐఐఎస్‌సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్‌, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.

భారత్‌లో వయోజనుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఎంతకాలం జీవిస్తున్నారనే దానితో పాటు ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నారనే అంశాన్ని అర్థం చేసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది. పోషకాహారం, జీవనశైలి, జీవక్రియ ఆరోగ్యం యొక్క ప్రాధాన్యాన్ని శాస్త్రీయ పరిశోధనలు విస్తృతంగా  వెల్లడిస్తున్నప్పటికీ, సామాజిక సంబంధాలు, జీవిత లక్ష్యం, వెల్‌నెస్‌ సహాయక వ్యవస్థలు, జీవసంబంధమైన సూచికలు వంటి అంశాలు జీవక్రియ ఆరోగ్యం, మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన లేదు. ‘హెల్త్‌ అండ్‌ హ్యాపీనెస్‌ స్టడీ’లో 1,000 మందికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొననున్నారు. ప్రతి ఒక్కరూ  సుమారు ఆరు నెలల పాటు ఈ అధ్యయనంలో భాగంగా ఉంటారు. బహుముఖ అంచనా విధానం ద్వారా శారీరక ఆరోగ్యం, జీవసంబంధమైన సూచికలు, పేగుల్లోని సూక్ష్మజీవుల సమ్మేళనం, పోషకాహారం, జీవనశైలి పద్ధతులు, శ్రేయస్సుకు సంబంధించిన సూచికలను ఈ అధ్యయనం పరిశీలించనుంది. తద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన అవగాహనను అందించడంతో పాటు ఆరోగ్యం, ఆనందం, వెల్‌నెస్‌పై మరింత లోతైన అవగాహనకు దోహదపడనుంది.

"సరైన పోషణ, చురుకుగా ఉండేలా ప్రోత్సహించే వ్యక్తులు లేదా నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చేసే సమాజం యొక్క మద్దతు చుట్టూ ఉన్నప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని హెర్బలైఫ్ ఇండియా వద్ద మేము నమ్ముతాము" అని హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ ఖన్నా అన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రజలు రోజువారీ జీవితంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనికి సంబంధించిన సమాధానం భారతీయుల జీవితాల నుంచే రావాలని కోరుకుంటున్నాం. ఐఐఎస్‌సీతో భాగస్వామ్యం ఈ తరహా పరిశోధనకు అవసరమైన శాస్త్రీయ కచ్చితత్వాన్ని అందిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు