టీఆర్పీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి

04-11-2026 | 10:00pm

టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ 

బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో టిఆర్పి పార్టీ బలోపేతానికి సమన్వయంతో కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ(Party District President Mahesh Varma) అన్నారు. పార్టీ టిఆర్పి బెల్లంపల్లి నియోజవర్గ(Bellampalli Constituency) స్థాయి  విస్తృతస్థాయి సమావేశం వాసాల అనిల్, సత్రవేణి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నూతన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, జిల్లా కమిటీ బలోపేతం, నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు నియామక పత్రాల అందజేత వంటి అంశాలపై చర్చించారు.

అలాగే రాబోయే రాజ్యాధికార పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలనిన్నారు. 

బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల గొంతుకగా పార్టీ నిలవాలని పేర్కొన్నారు.

తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని మహేష్ వర్మ స్పష్టం చేశారు..ఈ సమావేశంలో బెల్లంపల్లి నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు