గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
బోథ్ నవంబర్ 4 (విజయక్రాంతి): సోనాల మండలంలోని కోటకి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి(Ganja) మొక్కలు 11 సాగు చేస్తున్న ఫేస్వి శివరాం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఎస్సై వి .పురుషోత్తం తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నాడు అన్న పక్కా సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించగా పత్తి పంది పంటల మధ్యన అంతర పంటగా సాగు చేస్తున్న 11 గంజాయి మొక్కలను గుర్తించడం జరిగిందని ఎస్ఐ వివరించారు.
దీంతో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పట్టుకుందామని సాగు చేస్తున్న గంజాయి మొక్కల విలువ 1,10,000 ఉంటుందన్నారు. గంజాయి సేవించే అలవాటు ఉండటం వల్ల తాను కొనుగోలు చేసిన గంజాయిలో నుండి విత్తనాలు సేకరించి సాగు చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకోవడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి సాగు చేసిన సేవించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.