రేగులపల్లికి గుర్తింపు.. ఏఎంసీ డైరెక్టర్గా జీల లింగం
04-11-2026 | 10:16pm
బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన జీల లింగం వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామానికి చెందిన ఆయనకు మార్కెట్ కమిటీలో బాధ్యతలు దక్కడం పట్ల గ్రామస్తులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమానికి తనవంతు కృషి చేయడంతో పాటు మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం రేగులపల్లి గ్రామానికి గుర్తింపుగా నిలిచింది.