సీడ్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా ఆలహం శ్రీకాంత్ యాదవ్
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం(Chegunta Mandal), స్థానిక విత్తనాలు, ఎరువుల వ్యాపారుల సంక్షేమమే ధ్యేయంగా సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్(Seeds and Fertilizers Association) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు; ఈ నూతన కమిటీ అధ్యక్షుడిగా అల్లం శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా మిరపకాయల మహేష్, ఆది నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా గంప సంజీవ్, సంయుక్త కార్యదర్శులుగా బోయిన స్వామి, ఉప్పల వెంకటేశం, కోశాధికారిగా గంప రాజు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు; వ్యాపారుల హక్కుల పరిరక్షణకు, రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచే దిశగా అసోసియేషన్ను సమర్థవంతంగా ముందుకు నడిపించాలని సభ్యులు ఆకాంక్షించారు; తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ, యూనియన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.