బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల పరామర్శ
కోనరావుపేట, నవంబర్ 26 (విజయక్రాంతి):కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో(Bauusaipeta Village) ఇటీవల మరణించిన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు(Senior BRS leaders) ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్, సీనియర్ నాయకులు బైరగోని రాజేశం గౌడ్, షేక్ రహీం, తిక్కల పౌలు, షేక్ నజీర్, దర్శనాల చారి, బైరగోని రాము, షేక్ చాంద్, కాసీం, మహమ్మద్ రాజు తదితరులు పాల్గొన్నారు.